నేను ప్రేమించే నగరాల్లో విజయవాడ ఒకటి. అక్కడ నేను వ్యతిరేకించేవాళ్ళువున్నట్టే, నన్ను వ్యతిరేకించేవాళ్ళూ వుంటారు. ఈ వ్యక్తిగత వివాదాల్ని పక్కన పెడితే, ఆ నగరం మీద నా ప్రేమను ప్రకటించడానికే డాక్యుమెంటరీ తీస్తున్నాను.
అనిల్ గారూ! మనం చేసే ప్రతిపనినీ సమర్ధించే వాళ్ళు వున్నట్టే విమర్శించేవాళ్ళూ వుంటారు. నన్ను సమర్ధించేవాళ్ళు వున్నంత వరకు నన్ను విమర్శించేవాళ్లను పట్టించుకోను. ఇక కృష్ణా గోదావరి నదులే లేకుండే మన (నా) అస్థిత్వంలేదు. నేను కృష్ణా, గోదావరుల మధ్య పుట్టాను. నేను ఆ నేలను ప్రేమిస్తాను. నేను తెలమ్గాణ ఉద్యమాన్ని గట్టిగా సమర్ధించాను. దాని అర్ధం విభజన చట్టంలో సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని కూడా సమర్ధించినట్టుకాదు. కష్టకాలంలోవున్న నాభూమికి ఉత్తేజం నివ్వడానికి నేనే ఏది చేయడానికైనా సిధ్ధపడతాను. ఇక నీటి విషయం .... మనం ఒక విధంగా కాటన్ సంతతి. మర్యాదగా చెప్పుకోవాలనుకుంటే కాల్వల సంతతి.
No comments:
Post a Comment