BEZAWADA Movies - ధన్యవాదాలు
విజయవాడ
మీద ఒక డాక్యుమెంటరీని తీస్తున్నట్టు ప్రకటించగానే నాకు మద్దతు తెలిపిన
మిత్రులు Seetaram
Dandamudi , Venkat Kolluru , Kiran
Posani , Dara Gopi, Gopala Krishna Abburi, Naresh
Nandam , Anjana Rajesh, , Phaniprasad Chennamsetty, Anil Atluri తదితరులందరికీ ధన్యవాదాలు.
ఇది ఓ రెండు వారాలుగా ప్రతిపాదనలోవున్న అంశం. ఈ ప్రాజెక్టు ఒకరిద్దరి వల్ల
అయ్యేదికాదు. సామూహికంగా చేయాల్సిందే. నాతో సహా అనేక వందల మంది విజయవాడ మీద వేల
రచనలు చేశారు. వాటిని క్రోడీకరించడం ముందుగా చేయాల్సిన పని. స్క్రిప్టు పనిని ప్రస్తుతం
నేను చేస్తున్నాను. భరద్వాజ సహకరిస్తున్నాడు.
కార్యనిర్వాహక
కమిటీలు నాలుగయిదు వుంటేగానీ ఈ ప్రాజెక్టు సాకారంకాదు. మిత్రుల అంగీకారాన్ని తీసుకున్న తరువాత ఆ కమిటీలను ప్రకటిస్తాము.
స్క్రిప్టు ఫైనల్ కాపీని సరిచేసే బాధ్యతను గౌరవనీయులు సి రాఘవాచారి, ఖాదర్ మోహిద్దీన్,
జాన్సన్ చోరగుడిగార్లకు అప్పచెప్పాలని భావిస్తున్నాము.
స్క్రిప్టుకు కావలసిన ఇన్ పుట్స్, ప్రొడక్షన్ కు కావలసిన ఫొటోలు, వీడియోల సేకరణకు సీనియర్
పాత్రికేయులు సీతారాం దండమూడి. దారా గోపీ, అన్నవరపు బ్రహ్మయ్య, కొల్లూరి వెంకట్ నిర్వహిస్తారని
ఆశిస్తున్నాం.
స్క్రిప్టు పూర్తి అయ్యి, టెలీ-ప్లే సిద్ధం అయ్యాక, టెలీవిజన్ బ్రాడ్ కాస్టింగ్ క్వాలిటీలో చేయాలా? ధియేటర్ క్వాలిటీలో
తీయాలా అనేది అప్పుడు ఆలోచిస్తాము. దాన్ని బట్టి బడ్జెట్ వుంటుంది.
No comments:
Post a Comment