Tuesday 21 April 2015

హరిత బెర్మ్‌ పార్క్‌లో కేబినెట్‌

హరిత బెర్మ్‌ పార్క్‌లో కేబినెట్‌
  •  సమావేశాలకు వేదిక కానున్న ‘భవానీ’ ముఖద్వారం.. 
  • ఐఅండ్‌ఐ ఆధ్వర్యంలో నిర్మాణం! 
విజయవాడ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరం క్రమంగా రాజధాని హంగులు సంతరించుకుంటోంది. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి కార్యాలయాలు విజయవాడలో ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పాలనలో కీలకమైన కేబినెట్‌ సమావేశాల నిర్వహణ హాలు కూడా విజయవాడలోనే ఏర్పాటు కా నున్నది. భవానీ ద్వీపానికి అభిముఖంగా ఉన్న హరిత బెర్మ్‌పార్క్‌ను ఇందుకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. సువిశాలమైన బెర్మ్‌పార్క్‌ను కేబినెట్‌ సమావేశాలు నిర్వహించటానికి వీలుగా తీర్చిదిద్దా లని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఏపీటీడీసీ ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదే శాలు వచ్చాయి. దీంతో హరిత బెర్మ్‌పార్క్‌ను ప్రైవే టుపరం చేస్తారన్న విమర్శలకు తెరపడింది. భవా నీ ద్వీపాన్ని రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌ సెంతోషా దీవి తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనిపై సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర పర్యాటకాభివృ ద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కోసం అంతర్జాతీయ కన్సల్‌టెంట్‌కు అప్పగించటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వారంరోజుల్లో టెండర్లు పిలవనున్నారు. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ద్వీపంలోకి ప్రవేశించాలంటే సందర్శకులు, పర్యాటకులు ముందుగా హరిత బెర్మ్‌పార్క్‌కు చేరుకోవాలి. ఇక్కడ కాటేజీలు, రెస్టారెంట్‌, బార్‌తోపాటు మంచి ల్యాండ్‌ స్కేపింగ్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, బోటింగ్‌ యూనిట్స్‌ కూడా ఉన్నాయి. భవానీ ద్వీపం అంతర్జాతీయ స్థాయిలో అభి వృద్ధి చెందితే హరిత బెర్మ్‌పార్క్‌కు క్రేజు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బెర్మ్‌ పార్క్‌ను ప్రైవేటుపరం చేయబోతున్నారన్న ఊహా గానాలు రాగా, ఇవన్నీ నిజంకాదని ఇప్పుడు తేలిపోయింది. ఇక్కడ భారీ కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం దీనికి సంబంధించి ఇండస్ర్టీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ (ఐఅండ్‌ఐ) వాళ్లకు అప్పగిస్తున్నట్టు సమాచారం.